మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్లో బిల్లు మోత!
- ముంబై ఫైవ్‌స్టార్ హోటల్లో గెస్ట్‌కు చేదు అనుభవం
- ఒక పరాఠా, మూడు గుడ్లకు రూ. 2300 బిల్లు
- కేవలం మూడు ఉడికించిన గుడ్లకే రూ. 500 వసూలు
- ఇది అన్యాయం అంటూ గెస్ట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్
- హోటల్ ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేసిన గెస్ట్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అతను ఆర్డర్ చేసిన ఒక పరాఠా, మూడు ఉడికించిన గుడ్లు, పెరుగు, మిల్క్‌షేక్‌కు ఏకంగా రూ. 2,300 బిల్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ముఖ్యంగా కేవలం మూడు గుడ్లకు రూ. 499 ప్లస్ ట్యాక్సులు వసూలు చేయడాన్ని 'అబ్సర్డ్' (అసంబద్ధం) అంటూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. '@the90millennialguy' అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని హిల్టన్ హోటల్లో బస చేశాడు. రాత్రి డిన్నర్ కోసం రూమ్ సర్వీస్‌లో కొన్ని సాధారణ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. అనంతరం వచ్చిన బిల్లు చూసి నివ్వెరపోయాడు. "నేను ఆర్డర్ చేసింది పెద్ద ఫ్యాన్సీ డిష్ ఏమీ కాదు. కేవలం ఆలూ పరాఠా, కొన్ని ఉడికించిన గుడ్లు, పెరుగు, వనిల్లా మిల్క్‌షేక్. కానీ దీనికి బిల్లు రూ. 2,300 వచ్చింది. అంటే మూడు గుడ్ల ధర దాదాపు రూ. 500 అన్నమాట. ఇది నమ్మలేకపోతున్నాను" అని ఆవేదన వ్యక్తం చేస్తూ 'వాట్ ది హెల్' అనే టైటిల్‌తో వీడియోను పంచుకున్నాడు.
ఫైవ్‌స్టార్ హోటళ్లలో మౌలిక సదుపాయాల కారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయని తనకు తెలుసని, కానీ ఈ స్థాయిలో ఉండటం సమంజసం కాదని అతను అభిప్రాయపడ్డాడు. "బయట రూ. 10-12 పలికే ఒక్కో గుడ్డుకు ఇక్కడ సుమారు రూ. 160-170 చొప్పున వసూలు చేశారు. మార్కప్ వేసినా 4 లేదా 5 రెట్లు వేయాలి కానీ, ఈ స్థాయిలో ఉండటం చాలా అసంబద్ధం" అని అతను పేర్కొన్నాడు.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయింది. దీనికి 2.2 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు గెస్ట్‌కు మద్దతుగా నిలిస్తే, మరికొందరు హోటల్‌ను సమర్థించారు. "గుడ్ల సంగతి పక్కనపెడితే, ఒక్క పరాఠాకు రూ. 1100 వసూలు చేయడం మరింత దారుణం" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, "అంతర్జాతీయ పర్యాటకులకు ఈ ధర 20-25 డాలర్లతో సమానం, అది పెద్ద విషయం కాదు" అని మరొకరు అభిప్రాయపడ్డారు.
మరికొందరు నెటిజన్లు గెస్ట్‌నే తప్పుబట్టారు. "రూమ్ డైనింగ్ సర్వీస్‌కు అదనపు ఛార్జీలు ఉంటాయి. అదే బఫెలో తిని ఉంటే సగం ధరకే అయ్యేది. ఫైవ్‌స్టార్ హోటల్లో ధాబా రేట్లు ఆశించకూడదు" అని ఒకరు చురక అంటించారు. "గుడ్ల ధర రూ. 50 అయితే, వాటిని మీ బెడ్ వద్దకు డెలివరీ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ రూ. 450. ఎయిర్పోర్ట్ కాఫీ ధరను ఇంటి కాఫీతో పోల్చడం లాంటిదే ఇది" అని మరో యూజర్ కామెంట్ చేశారు. మొత్తంగా ఈ ఘటనతో ప్రీమియం హోటళ్లలో ధరల విధానంపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది.